హైద‌రాబాద్‌-తిరుప‌తి విమానానికి సాంకేతిక లోపం కార‌ణంగా  గాలిలోనే ఊగిపోయింది. ప్ర‌మాదాన్ని గుర్తించిన అధికారులు బెంగ‌ళూరువైపు మ‌ళ్లించారు. బెంగ‌ళూరులో దిగిన త‌రువాత ఆ విమానం డోర్లు తెరుచుకోలేదు. ఈ విమానం డోర్లు తెరుచుకోక‌పోవ‌డం ఎమ్మెల్యే రోజా, ప్ర‌యానికులు కాస్త ఆందోళ‌న‌లో ఉన్నారు. ఎమ్మెల్యే రోజా మంచిగానే ఉన్నామ‌ని.. కాక‌పోతే డోర్లు తెరుచుకోవ‌డం లేద‌ని మీడియాకు స‌మాచారం ఇచ్చారు.

ఇటీవ‌ల త‌మిళ‌నాడు హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం చోటు చేసుకున్న విష‌యం తెలిసిన‌దే. ఈ త‌రుణంలోనే ఈ విమానం సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో అందులో ప్ర‌యాణించే ప్ర‌యాణికులంద‌రూ ఆందోళ‌న చెందుతున్నారు. ఇప్ప‌టికే విమానం డోర్లు తెరుచుకోవ‌డం లేద‌ని సిబ్బందికి స‌మాచారం అందించ‌డంతో సిబ్బంది అక్క‌డికి చేరుకొని డోర్లు తెరిచేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సాంకేతిక లోపం కార‌ణంగా డోర్లు తెరుచుకోలేద‌ని.. ఎలాంటి ప్ర‌మాదం మాత్రం సంభ‌వించ‌లేద‌ని, గాలిలో ఊగిపోవ‌డంతో ఫైలెట్ ప్ర‌మాదాన్ని ప‌సిగ‌ట్టి బెంగళూరు వైపు మ‌ళ్లించి ల్యాండ్ చేసాడ‌ని సిబ్బంది పేర్కొంటున్నారు. 





మరింత సమాచారం తెలుసుకోండి: