
నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో కరోనా కలకలం రేకెత్తిస్తుంది. శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇద్దరు వైద్యులకు 12 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. కరోనా సోకిన వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపించారు. అయితే మొత్తం 14 మందికి కరోనా సోకడంతో అంతరిక్ష కేంద్రంలో పని చేస్తున్న మిగిలిన ఉద్యోగులకు పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్యేక మార్గదర్శకాలను షార్ అధికారులు విడుదల చేసారు. బయోమెట్రిక్ స్థానంలో అటెండెన్స్ రిజిస్టర్లను ఏర్పాటు చేసారు.
ఉద్యోగులు, వైద్యులకు కరోనా సోకడంతో ఈనెల చివరి వారంలో నిర్వహించాల్సిన రీ శాట్ ఉపగ్రహ ప్రయోగం వాయిదా పడే అవకాశముంది. సెకండ్‌వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఏపీ ఎదుర్కున్న ఏపీ ఇప్పుడు థర్డ్ వేవ్‌ను ఎదుర్కొవడానికి సిద్ధమవుతుంది. ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా వైద్యానికి సంబంధించిన అన్ని రకాల సదుపాయాలు, మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. సెకండ్ వేవ్ కంటే థర్డ్‌వేవ్ లో తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని, ఇప్పటికే దేశంలో థర్డ్‌వేవ్ ఎంటర్ అయిందని టాస్క్‌ఫోర్స్ స్పష్టం సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ సమయంలో షార్‌లోని కొంత మంది ఉద్యోగులు కరోనా బారీన పడ్డారు. శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయోగాలకు ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. మరలా కరోనా విజృంభిస్తుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.