ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్  ను ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసింది. త‌క్ష‌ణ‌మే ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి వ‌చ్చినట్టు ప్ర‌క‌టించిన‌ది. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ..  ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ నేరాల‌ను అరిక‌ట్ట‌డానికి పోలీసుల బారీ బందోబ‌స్త్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. మ‌రొక వైపు క‌రోనా, ఒమిక్రాన్ నేప‌థ్యంలో పోలింగ్ కేంద్రాల‌ను పెంచారు.

నేర చ‌రిత్ర క‌లిగిన అభ్య‌ర్థుల‌కు టికెట్ ఇవ్వాల‌ని ఎందుకు ఇవ్వాల‌నే దానిపై రాజ‌కీయ పార్టీలు క్లారిటీ ఇవ్వాల‌ని సీఈసీ తెలిపింది. క‌రోనా కార‌ణంగా ఎన్నిక‌ల స‌మ‌యాన్ని గంట పెంచుతున్న‌ట్టు వెల్ల‌డించింది. క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయిన పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌చ్చు అని సీఈసీ వివ‌రించింది.

 అయితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, పంజాబ్ రాష్ట్రాల‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల‌కు వ్య‌యాన్ని రూ.28 ల‌క్ష‌ల నుంచి రూ.40ల‌క్ష‌ల వ‌ర‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. గోవా, మ‌ణిపూర్ల‌లో పోటీచేసే అభ్య‌ర్థుల ఎన్నిక‌ల ఖ‌ర్చును రూ.28ల‌క్ష‌ల‌కు మాత్ర‌మే లిమిట్ చేసిన‌ది. రెండు డోసులు తీసుకున్న వారిని ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు వినియోగిస్తాం అని వెల్ల‌డించింది. అధికారుల‌ను ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్ల జాబితాలో చేర్చి వారికి బూస్ట‌ర్ డోస్ ఇస్తాం అని సీఈసీ తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: