అమెరికా రాజ‌ధాని న్యూయార్క్ న‌గ‌రంలో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఓ 19వ అంత‌స్థుల అపార్ట్‌మెంట్‌లో ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో 19 మంది అక్క‌డిక‌క్క‌డే స‌జీవ ద‌హ‌నం అయ్యారు. అయితే మృతుల్లో 9 మ‌ది చిన్నారులు ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రొక 60 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. వారిలో 13 మంది ప‌రిస్థితి విషమంగా ఉన్న‌ద‌నిన్యూయార్క్ మేయ‌ర్ స‌ల‌హాదారు స్టీఫెన్ రింగెల్ వెల్ల‌డించారు. పొగ పీల్చ‌డం ద్వారా క్ష‌త‌గాత్రులు మ‌రింత ఇబ్బందులు ప‌డుతున్నారు అని పేర్కొన్నారు.
 
సుమారు 200 మంది అగ్నిమాప‌క సిబ్బంది స‌హాయక చ‌ర్య‌ల్లో పాల్గొన్న‌ట్టు స‌మాచారం. భ‌వ‌నంలో చిక్కుకుపోయిన వారిని కాపాడారు. మ‌ర‌ణాల సంఖ్య మరింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూన్నారు. అపార్ట్‌మెంట్‌లో ఉన్న రెండ‌వ‌, మూడ‌వ అంత‌స్తులో ప్ర‌మాదం జ‌రిగినట్టు అధికారులు వెల్ల‌డించారు. అక‌స్మాత్తుగా ప్ర‌మాదం ఒక్క‌సారిగా మంట‌లు ఏర్ప‌డ‌డంతో మంట‌లు వేగంగా వ్యాపించి ఇత‌ర అంత‌స్తుల‌కు వ్యాపించిన‌ట్టు చెప్పారు. ఈ ప్ర‌మాదం షాక్ స‌ర్క్యూట్ వ‌ల్ల జ‌రిగిందా..?  లేక మ‌రేదైనా కార‌ణంతో జ‌రిగిందా అనేది మాత్రం స్ప‌ష్టం కాలేదు. పోలీసులు విచార‌ణ చేప‌ట్టిన త‌రువాత ప్ర‌మాదం ఓ క్లారిటీ రానున్న‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: