ఏపీకి చెందిన బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు పొగాకు బోర్డు సభ్యునిగా నియామితులయ్యారు. డిసెంబర్ 14, 2021న రాజ్యసభ సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజ్యసభ సచివాలయం తెలిపింది. పొగాకు బోర్డు చట్టం 1975లోని సెక్షన్ 4(4)(బి) ప్రకారం, పొగాకు బోర్డ్ రూల్స్, 1976లోని రూల్ 4(1) ప్రకారం, పొగాకు బోర్డు సభ్యునిగా రాజ్యసభ సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాదికి ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుకు ఈ అవకాశం దక్కినట్టు తెలుస్తోంది.

ఇటీవల బండి సంజయ్‌, బాలశారి పొగాకు బోర్డుకు కొంత కాలం కిందట ఎన్నికయ్యారు. ప్రస్తుతం బండి సంజయ్ తెలంగాణ నుంచి బాలశౌరి లోక్‌సభ నుండి పొగాకు బోర్డు పార్లమెంట్ ప్రతినిధులుగా పని చేస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు తన ఎన్నికపై సంతోషం వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు సంబంధించిన సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతానని.. వారి సంక్షేమం కోసం పొగాకు ఎగుమతులను ప్రోత్సహించడం కోసం మరింత చురుకుగా పనిచేస్తానని జీవీఎల్‌ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

gvl