తెలంగాణ‌లో క‌రోనా మ‌హమ్మారి కేసులు క్ర‌మంగా పెరుగుతున్న త‌రుణంలో రాష్ట్ర ప‌రిస్థితుల‌పై సోమ‌వారం రోజు మ‌రొకసారి హైకోర్టులో విచార‌ణ జ‌రిగిన‌ది. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ల సంఖ్య పెంచాల‌ని, ప్ర‌భుత్వాన్నీ హైకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా  ఒక రోజుకు ల‌క్ష ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు చేయాల‌ని హైకోర్టు పేర్కొన్న‌ది.  ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ ప‌రీక్ష‌ల వివ‌రాలను ప్ర‌తీ రోజు  వేరువేరుగా ఇవ్వాల‌ని కూడా ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా భౌతిక‌దూరం, మాస్క్‌ల నిబంధ‌న‌లు క‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని.. కొవిడ్ నియంత్ర‌ణ‌కు అప్ర‌మ‌త్త‌త ఎంతో అవ‌స‌రం అని కోర్టు సూచించింది.

మ‌రొక‌వైపు క‌రోనా నియంత్ర‌ణ‌పై ఇవాళ మంత్రివ‌ర్గంతో చ‌ర్చించ‌నున్న‌ట్టు ఏజీ ధ‌ర్మాస‌నం ముందు పేర్కొన్నారు. అయితే కోర్టు పూర్తి వివ‌రాల‌తో నివేదికను స‌మ‌ర్పించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరిన‌ది. రేప‌టి నుంచి హైకోర్టులో వ‌ర్చువ‌ల్‌గా కేసుల విచార‌ణ ఆన్‌లైన్‌లోనే పూర్తిస్థాయి విచార‌ణ జ‌రుగ‌నున్న‌ట్టు వెల్ల‌డించింది. క‌రోనా వ్యాప్తి వ‌ల్ల మ‌ళ్లీ వ‌ర్చువ‌ల్ విచార‌ణ‌లు జ‌ర‌ప‌నున్న కోర్టు.. త‌దుప‌రి విచార‌ణ‌ను జ‌న‌వ‌రి 25 వ‌ర‌కు వాయిదా వేసింది

అయితే జ‌న‌వ‌రి 12 వ‌ర‌కు తెలంగాణ వ్యాప్తంగా నెల‌కొన్న ప‌రిస్థితిపై రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ అధికారులు హైకోర్టుకు నివేదిక అంద‌జేసారు. ఈనెల 12 వ‌ర‌కు మేడ్చ‌ల్ జిల్లాలో అత్య‌ధికంగా 6.95 శాతం పాజిటివీ రేటు ఉండ‌గా.. జీహెచ్ఎంసీలో 5.65 శాతం పాజిటివిటీ రేటు ఉంద‌ని అధికారులు రిపోర్టులో నివేదించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: