కోవిడ్-19 తాజా వేరియంట్ ఓమిక్రాన్ తన ప్రతాపాన్ని చూపుతోంది. తెలుగు రాష్ట్రాలలో కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. కోవిడ్-19 పరీక్షలు పెద్ద సంఖ్యలో చేస్తుండటంతో కేసుల సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. ఇటీవలే సంక్రాంతి సంబరాలు జరుపుకున్నతెలుగు ప్రజలు తాజాగా కోవిడ్-19 బారిన పడుతున్నారు. ఒక్కరోజే పదివేల కొత్త కేసులు వెలుగు చూశాయి. ఎక్కడో తెలుసా ?
గడచిన ఇరవైనాలుగు గంటల్లో పదివేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూసినట్లు ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో యావత్ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 41, 713 పరీక్షలు నిర్వహించగా , అందులో పదివేలకు పైగా కొత్త కేసులు ఉన్నట్లువైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. విశాఖపట్ణం జిల్లాలో అత్యధికంగా 1827 కొత్త కేసులు ఒక్క రోజులో నమోదయ్యాయి. తరువాతి స్థానంలో చిత్తూరు జిల్లా ఉంది. ఈ జిల్లాలో గడచిన ఇరవై నాలుగు గంటల్లో 1822 కొత్త కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా 216 కొత్త కేసులతో చివరి స్థానంలో ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకూ 21,24,546 పాజిటివ్ కేసులు నమోద్యాయి. అంతే కాకుండా తాజాగా కోవిడ్ కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పాయారు.