క్రికెట్ ప్రియులకు శుభవార్త.. 2022 టీ20-ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదలైంది. 2022 టీ20-ప్రపంచకప్‌ షెడ్యూల్‌ ను ఐసీసీ విడుదల చేసింది. అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు 2022 టీ20-ప్రపంచకప్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. 2022 టీ20- ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ షెడ్యూల్‌లో విశేషాలేమిటంటే.. గ్రూప్‌-2 సూపర్‌ 12 స్టేజ్‌లో భారత్ తలపడుతోంది. గ్రూప్‌-2లో పాకిస్తాన్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో భారత్‌ మ్యాచ్‌లు ఆడబోతోంది.


గ్రూప్‌-2లో రెండు క్వాలిఫయర్‌ జట్లతో భారత్‌ తలపడుతుంది. అక్టోబర్‌ 23న పాకిస్తాన్‌తో భారత్‌ తొలి పోరు ఉంటుంది. అలాగే నవంబర్‌ 9న 2022 టీ20-ప్రపంచకప్‌ తొలి సెమీఫైనల్‌ నిర్వహిస్తారు. నవంబర్‌ 10న రెండో సెమీ ఫైనల్‌ నిర్వహిస్తారు. మెల్‌బోర్న్‌ వేదికగా నవంబర్‌ 13న ఫైనల్‌ ఉంటుంది. ఇక డేట్స్ వచ్చేశాయి కాబట్టి.. క్రికెట్ ప్రియులు.. ఆ డేట్లు లాక్ చేసుకోండి. మీ ప్లానింగ్‌ రెడీ చేసుకోండి.. క్రీడాసంరంభానికి సిద్ధం కండి.


మరింత సమాచారం తెలుసుకోండి: