మావోయిస్టులు ఒక్క‌సారిగా రెచ్చిపోయారు.  మ‌హారాష్ట్రలోని గ‌డ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు బీభ‌త్సం సృష్టించారు. బాంర‌గ‌డ్ తాలుకాలో రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు ఉప‌యోగిస్తున్న రెండు జేసీబీ, 9 ట్రాక్ట‌ర్ల‌కు నిప్పు అంటించారు. దీంతో రూ.కోటి వ‌ర‌కు న‌ష్టం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. దుర్గరాజ్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని 100 మంది మావోయిస్టులు ఆ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డిన‌ట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌తో గ‌డ్చిరోలి ప్రాంతంలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌త కొంత‌కాలంగా మావోయిస్టులు త‌మ ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నం చేసారు.

అయితే ఇటీవ‌లే మావోయిస్టుల‌కు ఎదురు దెబ్బ త‌గిలింది. తెలంగాణ‌-చ‌తీస్‌గ‌డ్ స‌రిహ‌ద్దుల్లోని ములుగు జిల్లా వెంక‌టాపూరం మండ‌లం పామునూరు వ‌ద్ద ఒక ఎన్‌కౌంట‌ర్‌, జెల్లా స‌మీప క‌ర్రిగుట్ట‌ల వ‌ద్ద ఒక ఎన్‌కౌంట‌ర్ ఛ‌తీస్‌గ‌డ్ రాష్ట్రం దంతెవాడ-సుక్కా జిల్లాల స‌రిహ‌ద్దు ప్రాంతంలో మ‌రొక‌టి చోటు చేసుకున్న‌ది. ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన స‌మ‌యంలో వారి వ‌ద్ద నుంచి ఇన్‌పాస్ రైఫిల్‌, సింగిల్‌బోర్‌, తుపాకుల‌తో పాటు 10రాకెట్ లాంఠ‌ఛ‌ర్లు,  కిట్‌బ్యాగ్‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు.  తాజాగా గ‌డ్చిరోలిలో మావోలు బీభ‌త్సం సృష్టించ‌డం గ‌మ‌నార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: