గుడివాడ క్యాసినో వ్యవహారంపై ఇవాళ టీడపీ బృందం గవర్నర్‌ను కలవబోతోంది. నిజనిర్ధరణ కమిటీ పేరిట ఏర్పాటైన బృందం గవర్నర్‌ను కలిసి గుడివాడ క్యాసినో వ్యవహారంపై వివరించనుంది. తమ బృందం పరిశీలనలో వెల్లడైన అంశాలను గవర్నర్‌కు వివరించనున్నారు. గుడివాడలో జూదం నిర్వహించారని టీడీపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.


గుడివాడ క్యాసినో అంశంపై తాము సేకరించిన ఆధారాలు, కరపత్రాలు, వీడియోలను గవర్నర్‌కు అందించనున్నారు. ఈ ఆధారాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను టీడీపీ నేతలు కోరబోతున్నారు. మంత్రిగా కొనసాగేందుకు కొడాలి నాని అనర్హుడని.. అతడిని మంత్రివర్గం నుంచి తొలగించాలని టీడీపీ నేతలు కోరునున్నారు. అయితే.. టీడీపీ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా సాధించేది ఏమైనా ఉంటుందా అన్నది అనుమానమే.. ఎందుకంటే.. గతంలోనూ ఎన్నో సీరియస్ అంశాలపైనా గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏదో మీడియాలో కాసేపు హడావిడి తప్ప సాధించేది ఏమీ కనిపించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: