క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ వ్యాప్తంగా పీడిస్తున్న విష‌యం తెలిసిన‌దే.  దేశంలో రాష్ట్రంలో ఇలా అక్క‌డ ఇక్క‌డ అని తేడా లేకుండా వారు వారు అని చూడ‌కుండా ఎవ‌రినైనా ట‌చ్ చేస్తుంది. ముఖ్యంగా చిత్ర ప‌రిశ్ర‌మ ఒక్క‌సారిగా కుదేలు చేసిన మ‌హ‌మ్మారి మ‌రొక‌సారి ప్ర‌జ‌ల‌పై విరుచుకుప‌డుతుంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా  స్టార్లు క‌రోనా బారీన  ప‌డుతూనే ఉన్నారు. ఈ మ‌ధ్య కోలీవుడ్ సీనియ‌ర్ హీరో శ‌ర‌త్‌కుమార్ కుటుంబం మొత్తం క‌రోనా బారిన ప‌డిన విష‌యం విధిత‌మే.

రాధిక శ‌ర‌త్ కుమార్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కు పాజిటివ్ రావ‌డంతో వారు ఐసోలేష‌న్ లో ఉండి ఇటీవ‌లే బ‌య‌టికి వ‌చ్చారు. శ‌ర‌త్‌కుమార్ సైతం కోలుకొని బ‌య‌టికి వ‌చ్చిన కొద్ది రోజుల‌కే మ‌రొక‌సారి క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్నీ ఆయ‌న స్వ‌యంగా ట్విట్ చేసారు. ప్రియ‌మైన స్నేహితులు, నా ద‌గ్గ‌రి బంధువులు, రాజ‌కీయ పార్టీలోని నా సోద‌ర సోద‌రీ మ‌ణుల‌కు తెలిపుతున్నాను. తాజాగా  నేను కోవిడ్ ప‌రీక్ష  చేయించుకోగా.. క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు తేలింది. ప్ర‌స్తుతం ఐసోలేష‌న్లో ఉన్నాను. గ‌త వారం రోజులుగా ప‌రిచ‌యం ఉన్న ప్రియ‌మైన వారంద‌రూ వెంట‌నే మిమ్మ‌ల్ని మీరు ప‌రీక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను అని వెల్ల‌డించారు. ఈ విష‌యం తెలుసుకున్న శ‌ర‌త్‌కుమార్ అభిమానులంద‌రూ ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: