డిజిటల్‌ కరెన్సీ వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎలక్ట్రానిక్‌ వ్యాలెట్ల తరహాలోనే ఈ డిజిటల్‌ కరెన్సీ ఉంటుందని అంచనా.. ఈ కరెన్సీకి ప్రభుత్వ హామీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారతప్రభుత్వం జారీ చేయబోయే డిజిటల్‌ కరెన్సీ 2023 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


ప్రస్తుతం ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలో ఉన్న ఎలక్ట్రానిక్‌ వ్యాలెట్ల తరహాలోనే డిజిటల్‌ కరెన్సీ కూడా పనిచేస్తుందని చెబుతున్నాయి. ఈ కరెన్సీకి ప్రభుత్వ హామీ ఉంటుందని క్లారిటీ ఇచ్చాయి. రిజర్వు బ్యాంకు మద్దతుతో డిజిటల్‌ రూపీని ప్రవేశపెట్టనున్నట్లు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్వయంగా ప్రకటించారు.


ఈ డిజిటల్ కరెన్సీ కోసం ఆర్‌బీఐ ప్రత్యేక నెంబర్లను కేటాయిస్తుంది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నగదుతో పోలిస్తే డిజటల్‌ కరెన్సీ అంతకంటే భిన్నంగా ఏమీ ఉండదట. డిజిటల్‌ కరెన్సీని సాధారణ కరెన్సీకి డిజిటల్‌ రూపంగానూ చెల్లింపులు జరపొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: