ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తీరుపై ప్రధాని మోడీ పార్లమెంటులో మాట్లాడిన వైఖరిపై టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ఏర్పాటు మీద మరోసారి విషం చిమ్ముతూ పార్లమెంట్ లో అడ్డగోలుగా మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై నిరసన తెలుపుతామని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్  కేటీఆర్‌ తెలిపారు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపు ఇచ్చారు.


మోడీ వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బిజెపి పార్టీ దిష్టిబొమ్మల దహనం చేయాలని కేటీఆర్ పిలుపు ఇచ్చారు. నల్లజెండాలతో  నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కేటీఆర్ తెలిపారు.


అసలు ఇంతకీ ప్రధాని మోడి ఏమన్నారంటే.. కాంగ్రెస్‌కు ప్రజలన్నా, ప్రజాఆకాంక్షలన్నా లెక్కలేదని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ను అడ్డగోలుగా విభజించిందని విమర్శించారు. గతంలో బీజేపీ ముడు రాష్ట్రాలు ఇచ్చినా ఎక్కడా గొడవలు జరగలేదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యం అంటే పడదని ప్రధాని మోడీ విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: