కేంద్రం నదుల అనుసంధానంపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాల నీటి సమస్యను ఎదుర్కోవచ్చని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగానే గోదావరి- కావేరీ నదులను అనుసంధానించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ఈ అనుసంధానంపై చర్చించేందుకు కేంద్రం ఈనెల 18న ఐదు  రాష్ట్రాల జలవనరులశాఖ అధికారులతో సమావేశం కానుంది.

ఢిల్లీలో జలశక్తిశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ భేటీ జరగబోతోంది. ఈ భేటీలో గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టుపై చర్చిస్తారు. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ నేతృత్వంలో సమావేశం జరగబోతోంది. ఈ భేటీకి రావాలని 5 రాష్ట్రాల జలవనరులశాఖ కార్యదర్శులకు ఆదేశాలు వెళ్లాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి జలవనరులశాఖ కార్యదర్శులకు కేంద్రం నుంచి సమాచారం వెళ్లింది. ఢిల్లీ రావాలని.. ఈనెల 18 మధ్యాహ్నం జలవనరులశాఖ కార్యదర్శుల సమావేశం ఉంటుందని కేంద్రం పేర్కొంది. మరి ఈ భేటీలో ఏం నిర్ణయిస్తారో..


మరింత సమాచారం తెలుసుకోండి: