ఇవాళ సీఎం జగన్ విశాఖ పట్నం రానున్నారు. ఈ మధ్యాహ్నం రెండున్నరకు జగన్ విశాఖ రానున్నారు. విశాఖ పట్నంలో జరుగుతున్న నావీ కార్యక్రమం మిలన్ 2022 కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. మిలన్ 2022 సిటీ పరేడ్ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. నేవల్ డాక్ యార్డులో ఇటీవల నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను సీఎం జగన్ సందర్శిస్తారు.


ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ  నౌకను సీఎం పరిశీలిస్తారు. దీంతో  పాటు జలాంతర్గామి ఐ ఎన్ ఎస్ వేలను కూడా జగన్ సందర్శిస్తారు. ఈ సాయంత్రం మిలన్ 2022 సందర్భంగా ఆర్కే బీచ్ లో నేవీ అంతర్జాతీయ సిటీ పరేడ్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం తిలకిస్తారు. సముద్ర తీరంలో దాదాపు గంటన్నర పాటు జరిగే విన్యాసాలను సీఎం జగన్  వీక్షిస్తారు. ఆ తర్వాత రాత్రి ఏడు గంటలకు సీఎం జగన్ విజయవాడకు తిరుగ ప్రయాణం అవుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: