అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. మంచు విష్ణు వద్ద నాగ శ్రీను హెయిర్ స్టయిలిస్ట్ గా పని చేస్తున్నారు. ఈ నాగ శ్రీను బోరబండకు చెందిన వాడు. నాగ శ్రీను ఈ నెల 17న విష్ణుకు చెందిన హెయిర్ డ్రెస్సింగ్, మేకప్ సామగ్రిని చెప్పా పెట్టకుండా తీసుకెళ్లిపోయాడట. ఈ సామాగ్రి విలువ 5లక్షల రూపాయల వరకూ ఉంటుందట. జూబ్లీహిల్స్ సీబీఐ కాలనీలోని కార్యాలయంలోని మంచు విష్ణు కార్యాలయంలో ఈ చోరీ జరిగిందట.
ఈ సామగ్రి గురించి నాగ శ్రీనును కనుక్కుందామని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదట. దీంతో నాగ శ్రీను చోరీకి పాల్పడినట్లు మంచు విష్ణు లీగల్ మేనేజర్ సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 19న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారట. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.