తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ దిల్లీలో కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ ఈ టూర్‌ను పూర్తిగా ఆరోగ్య విషయాలకే కేటాయించారు. నిజానికి కేసీఆర్‌ నిన్ననే  కంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. అయితే.. నేత్ర వైద్య నిపుణుడు సచ్‌దేవ్‌ అందుబాటులో లేరు. అందువల్ల కంటి పరీక్షలు ఇవాళ చేయించుకుంటున్నారు. ఇప్పటికే  కేసీఆర్‌ భార్య శోభ ఎయిమ్స్‌లో పరీక్షలు చేయించుకున్నారు.


ఇవాళ కేసీఆర్ కంటి పరీక్షలు చేయించుకున్న తర్వతా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు తిరిగి హైదరాబాద్‌ వచ్చేస్తారు. ఈ పర్యటనలో రాజకీయాలకు అవకాశం లభించలేదు. కేసీఆర్ కేజ్రీవాల్ భేటీ జరుగుతుందని ప్రచారం జరిగినా.. అది కుదరలేదు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ అనేక మంది ప్రముఖులను కలుస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ.. ఆయన ఈసారి ఏ నేతలనూ కలవలేదు. దిల్లీ పర్యటనలో కేసీఆర్ తన పూర్తి సమయం ఆరోగ్యానికే కేటాయించారు. ఈ పర్యటనలో ఆయన దంత వైద్యం కూడా చేయించుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: