ఏపీ సీఎం జగన్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగినులకు పిల్లల సంరక్షణ సెలవులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ 60 రోజులుగా ఉన్న ఈ సెలవులను ఇకపై మరో మూడు రెట్లు పెంచేశారు. అంటే 60 రోజుల నుంచి ఏకంగా 180 రోజులకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 11 వేతన సవరణ సంఘం చేసిన సిఫార్సులకు అనుగుణంగా ఈ సెలవులు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

మహిళలకు పెద్ద పీట వేయడంలో తమ సర్కారు దేశంలోనే టాప్ అని సీఎం జగన్  చెప్పుకుంటున్నారు. అన్ని రంగాల్లోనూ వీలైనంత వరకూ మహిళలను ప్రోత్సహిస్తున్నామని సీఎం జగన్ అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అనేక రంగాల్లో మహిళలను తన ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని.. దేశంలో ఇలాంటి ప్రభుత్వం మరెక్కడా లేదని జగన్ ఘనంగా చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: