ఏపీకి ఇదో గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌కు దక్షిణ మధ్య రైల్వే ఓ గిఫ్ట్ ప్రాజెక్టు ఇచ్చింది. దక్షిణ మధ్య రైల్వే పైలట్‌ ప్రాజెక్టుగా వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ కాన్సెప్ట్ ను తిరుపతి రైల్వే స్టేషన్‌ లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంది. కేంద్రం బడ్జెట్ లోనే ఈ కొత్త కాన్సెప్ట్ ను ప్రకటించింది. అయితే.. ఈ ప్రాజెక్ట్ కోసం దేశంలోనే తొలి రైల్వే స్టేషన్‌గా తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేసుకోవడం ఏపీకి సంతోషం ఇచ్చే వార్తగా చెప్పుకోవచ్చు. ఈనెల 25న ఈ పైలట్ ప్రాజెక్ట్ తిరుపతిలో మొదలవుతుంది. ఈ ప్రాజెక్టు ప్రకారం తిరుపతి రైల్వే స్టేషన్‌ను ప్రమోషనల్ హబ్‌గా మారుస్తారు. అంటే స్థానికంగా తయారవుతున్న ఉత్పత్తుల్ని తిరుపతి రైల్వే స్టేషన్‌లో ప్రమోట్ చేస్తారు. దీని ద్వారా  స్థానిక ఇండస్ట్రీలకు మద్దతుగా నిలిచినట్టు అవుతుంది. దీని ద్వారా లోకల్ కళాకారులు, కార్మికులు, గిరిజనులకు మంచి ఉపాధి దొరుకుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: