వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయబోనని ఇటీవల పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన టీడీపీ డిప్యూటీ లీడర్ నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.  ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై మాట్లాడారు.

ఇప్పుడున్న పరిస్థితిని బట్టి టీడీపీ - జనసేన కలిస్తే 150 నుంచి 160 సీట్లు వస్తాయంటున్నారు నిమ్మల రామానాయుడు. అదే టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే 100 నుంచి 110 సీట్లు వస్తాయట. గత ఎన్నికల్లో ఓడియినా టీడీపీకి 40 శాతం ఓట్లు వచ్చిన విషయం మరిచిపోకూడదంటున్నారు నిమ్మల రామానాయుడు. ఏపీలో అధికారం దక్కాలంటే 88 సీట్లు గెలవాలి. టీడీపీ సొంతంగా పోటీ చేసినా  100 సీట్లు నుంచి 110 సీట్లు వస్తాయని రామానాయుడు చెప్పటం ద్వారా టైట్ ఫైట్ ఉంటుందని చెప్పినట్టయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: