హైదరాబాద్‌లో మరోసారి భూములు వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 34 ఎకరాల భూముల వేలం వేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. గురువారం ఈ భూముల వేలం జరగబోతోంది. ఈ భూముల  వేలం ద్వారా రూ. 1,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇంతకీ ఈ భూములు ఎక్కడ అంటారా.. హైదరాబాద్ శివారులోని చందానగర్‌, అమీన్‌పూర్‌లలోని 34 ఎకరాలను ఈసారి వేలం వేస్తున్నారు. ఈ 34 ఎకరాలను 28 ప్లాట్లుగా విభజించి టీఎస్‌ఐఐసీ ద్వారా వేలం వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బూమ్ ఉన్న ప్రాంతాల్లో ఈ భూములు ఉండటం వల్ల రేటు బాగానే వస్తుందని అంచనా వేస్తున్నారు. అందులోనూ ఇది ప్రభుత్వం అభివృద్ధి చేసిన లేఅవుట్‌ కావడం వల్ల మంచి డిమాండ్‌ ఉంటుంది. చందానగర్‌లో ఆరంభ టౌన్‌ షిప్‌లో మూడు ప్లాట్ల కింద 2.6 ఎకరాలు వేలం వేస్తారు. అలాగే అమీన్‌పూర్‌లో 25 ప్లాట్ల కింద 31.68 ఎకరాలు వేలం వేస్తారు. ఈ భూముల కనీస ధర గజం రూ. 40 వేలు.


మరింత సమాచారం తెలుసుకోండి: