అసలే ఎండాకాలం మండిపోతోంది. ఇక ఇప్పుడు ఇంట్లో ఏపీ ఎప్పుడూ ఆన్‌లో ఉండాల్సిందే.. కూలర్లు, ఫ్యాన్లు ఆగేదే లేదు.. ఎండాకాలంలో విద్యుత్ వినియోగం పీక్స్‌లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ ఈ ఏడాది తెలంగాణలో అప్పుడే విద్యుత్ వినియోగం అత్యధిక స్థాయికి చేరింది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇది కొత్త రికార్డులు సృష్టిస్తోంది. నిన్న మ.12.28 గంటల సమయంలో 14,160 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం నమోదైంది. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు అయ్యింది.  ఉష్ణోగ్రతలు భారీగానే ఉంటుండం వల్ల మరో నాలుగైదు రోజులు విద్యుత్ వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉంది. అందుకే అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 18 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా సరఫరా చేసేందుకు వీలుగా సన్నద్ధం అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: