శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.  శ్రీకాకుళం జిల్లా లోని జి.సిగడాం మండలం బాతువా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ సాంకేతిక సమస్య వల్ల గౌహతి ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గౌతమి ఎక్స్‌ ప్రెస్‌ రైలు నిలిచిపోవడం వల్ల కొంత మంది ప్రయాణికులు  కిందకు దిగడం జరిగింది. సరిగ్గా అదే సమయంలో మరో ట్రాక్‌పై వస్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ వారిని ఢీకొట్టింది. గౌతమి ఎక్స్ ప్రెస్ నుంచి కిందకు దిగిన ప్రయాణికులను కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే మొదట ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆరు మృతదేహాలను ప్రమాద స్థలంలో గుర్తించారు. మృతుల సంఖ్య  పెరిగవచ్చని కూడా తెలుస్తోంది. ఇది ప్రయాణికుల నిర్లక్ష్యం కారణంగానే జరిగినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి చూస్తే తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: