ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రులు పరిశుభ్రంగా ఉండేలా తక్షణం చర్యలు చేపట్టాలని మంత్రి విడదల రజని ఆదేశించారు. మంత్రి  కోవిడ్ సమయంలో వైద్యులు అద్భుతమైన సేవలందించారని ఇప్పుడు మళ్లీ కోవిడ్ విజృంభిస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో అనుక్షణం పర్యవేక్షణ చేయాల్సిందిగా మంత్రి విడదల రజని ఆదేశించారు. ఇకపై ఫీవర్ సర్వేను నిరంతరం చేపట్టాల్సిందిగా మంత్రి విడదల రజని సూచించారు. నకిలీ మందులు ఎక్కడా విక్రయించుకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి డ్రగ్ కంట్రోల్ అధికారులను మంత్రి విడదల రజని ఆదేశించారు. వైద్యారోగ్యశాఖలో జరిగిన బదిలీలకు సంబంధించి పర్యవేక్షించాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రులను ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లోని పారిశుధ్ధ్యం, పడకల నిర్వహణ, రోగులకు అందే భోజనం అన్నీ సక్రమంగా లేకపోతే ఊరుకునేది లేదని మంత్రి విడదల రజని హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: