నిరుపేద ఎస్సీ, ఎస్టీల పిల్లలు ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకుంటున్నారు. అయితే.. వీరికి సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. హాస్టల్‌లో ఉంటూ.. దగ్గర్లోని గవర్నమెంట్ స్కూళ్లో వీరు చదువుకుంటారు. స్కూల్ తర్వాత వీరిని పట్టించుకునే వారు ఉండరు. అయితే.. ఇకపై ప్రభుత్వ హాస్టళ్లలో ట్యూషన్ సదుపాయం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్‌కి అతి ఇష్టమైన శాఖల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఒకటని మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. సాంఘిక సంక్షేమ హాస్టల్‌లలో మౌలిక వసతుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న 1700 వసతి గృహాల్లో 700 ఎత్తి వేశారన్నారని మంత్రి మేరుగ నాగార్జున గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: