రష్యా,
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో
అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. బాంబుల మోతలతో అట్టుడుకుతున్న
ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించాలని
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే
రష్యా సైనిక చర్యతో అట్టుడుకుతున్న
ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను సందర్శించాలని జో బైడెన్ తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని
అమెరికా హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ ఛైర్మన్ ఆడమ్ స్కిఫ్ మీడియాకు తెలిపారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో
అమెరికా కాంగ్రెస్ బృందం కీవ్ లో ఈ విషయంపై భేటీ అయ్యి చర్చించింది. ఆ తర్వాత
అమెరికా ప్రతినిధి ఆడమ్ స్కిఫ్ జోబైడెన్ పర్యటన విషయాన్ని వెల్లడించారు. జో బైడెన్ పర్యటన ఎంత తొందరగా ఈ పర్యటన సాధ్యమవుతుందనే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. నేరుగా
అమెరికా అధ్యక్షుడు యుద్ధ రంగంలోకి దిగాడంటే పరిస్థితులు ఏటైనా దారి తీయొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.