వైసీపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు.. సొంత కులం నుంచి సెగ తగ్గట్లేదు. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన ఆయన కొన్ని రోజుల క్రితం ఓ సభలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డికి మోకాళ్లపై కూర్చుని నమస్కరించిన వివాదం ఇంకా సద్దుమణగట్లేదు. అయితే అది తన సంస్కారం అని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వేణు గోపాల కృష్ణ సమర్థించుకున్నారు.


ఇటీవల అమలాపురంలో కోనసీమ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీ వైసీపీ సమీక్ష సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ నాయకులు అమలాపురంలో మంత్రి వేణుగోపాల్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో మంత్రి అమలాపురంలో మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన కొంతమంది శెట్టి బలిజలు తన పట్ల లేనిపోని విమర్శలు చేస్తున్నారని మంత్రి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: