ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ఫైర్ అయ్యారు. నిజాయితీగా పనిచేసే ఒక పోలీసు అధికారిని కక్ష సాధింపు చర్యలతో వైసీపీ ప్రభుత్వం బలితీసుకుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఇప్పటి వరకూ జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాలు, ప్రజలను బలి తీసుకుందని.. ఇప్పుడు వారు అయిపోయారు.. ఇక పోలీసుల వంతు వచ్చిందని నారా లోకేశ్ విమర్శించారు.
కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణని వెంటాడి వేధించి చంపేశారని అనుమానాలున్నాయని నారా లోకేశ్ అనుమానం వ్యక్తం చేశారు. కక్ష సాధింపుల వల్లే గోపాలకృష్ణ మరణించారని నారా లోకేశ్ అన్నారు. అయితే.. సాటి పోలీసులే కట్టుకథలు అల్లడం విచారకరమని.. ఎస్ఐ అనుమానాస్పద మరణంపై న్యాయ విచారణ జరగాల్సిందేనని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని నారా లోకేశ్ కోరారు. మృతిచెందిన గోపాలకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. చనిపోయింది తమ వాడు కాదనుకునే పోలీసుల వరకూ ఈ కక్ష సాధింపులు వస్తాయని నారా లోకేశ్ హెచ్చరించారు. అప్పుడు వారి వైపు ఎవరూ వుండరని లోకేశ్ గుర్తు చేశారు.