లక్షల్లో జీతాలు రావాలంటే.. కేవలం సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు మాత్రమే అన్న ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఇతర రంగాల్లోనూ నిపుణులకు మంచి జీతాలు వస్తున్నాయి. అలాంటి రంగాల్లో వ్యవసాయ అనుబంధ రంగం ఒకటి. ఇందులోనూ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు విస్తృతం అవుతోన్నాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్ జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ అందిస్తున్న అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్ పీజీ కోర్సు వాటిలో ఒకటి. ఈ కోర్సు విద్యార్థులకు భవిష్యత్తుకు బంగారుబాటలు వేస్తోంది.


ఈ రాజేంద్రనగర్ జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థలో  అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్ పీజీ కోర్సు  2017 నుంచి 2022 వరకు ఇక్కడ చదివిన నాలుగు బ్యాచ్‌ల విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తున్నాయి.  ఈ అకాడమి పీజీడీఎం, ఏబీఎం కోర్స్‌లు అందిస్తోంది. ఈ కోర్సుల్లో చేరాలంటే వ్యవసాయ అనుబంధ శాస్తాలకు సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ ఉండాలి. అలా.. ఈ కోర్సులు పూర్తి చేసిన ఎంతో మంది విద్యార్థులు ఇప్పటికే  పలు సంస్థల్లో ఉన్నత హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: