ఉక్రెయిన్, రష్యా యుద్ధం కొత్త మలుపులు తిరుగుతోంది. ఉక్రెయిన్ లోని వ్యూహాత్మక నగరం మరియుపోల్ ను రష్యా ఇటీవల స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మరియుపోల్‌లో అడుగు పెట్టి విజయం సాధించిన రష్యాకు ఆ తర్వాత కూడా ఉక్రెయిన్‌ సేనలు చుక్కలు చూపిస్తున్నాయి. ఎందుకంటే.. మరియుపోల్‌లో ఉక్రెయిన్‌ సైన్యాలు ఎక్కడికక్కడ మందు పాతర్లు పెట్టాయట. ఇప్పుడు రష్యా సేనలు అక్కడ అడుగడుగునా ఉన్న మందుపాతరలను తొలగించే పనిలో ఉన్నాయి.


ఇప్పటికే తాము వందల సంఖ్యలో మందుపాతరలను పుతిన్ బలగాలు తొలగించామని రష్యా చెబుతోంది. అజోవ్ సముద్ర తీరంలో.. ఉక్రెయిన్ దళాలు పాతిపెట్టిన మందుపాతరలను నిర్వీర్యం చేస్తున్న దృశ్యాలను రష్యా మీడియాకు విడుదల చేసింది. మందుపాతరలను నిర్వీర్యం చేసేందుకు రోబోటిక్ డిమైనింగ్ యంత్రాలను ఉపయోగిస్తోంది. ఇప్పటివరకూ అజోవ్ సముద్ర తీరంలో 50 కిలోమీటర్ల మేర 300 మందుపాతరలను తొలగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: