కేసీఆర్‌తో వ్యవహారం సెటిల్ చేయాలని ప్రధాని మోదీని ఏపీ సీఎం జగన్ కోరారు. ఇంతకీ ఏ వ్యవహారం అంటారా.. అదేనండీ.. విభజన పంచాయితీలు ఇంకా ఉన్నాయి కదా. తెలంగాణ ప్రభుత్వం రూ.6,627.86 కోట్ల రూపాయల విద్యుత్‌ బకాయిలను ఏపీకి చెల్లించాలట. కానీ.. వాటిపై తెలంగాణ సర్కారు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదట. ఇప్పటికే రాష్ట్రంలోని విద్యుత్‌పంపిణీ, ఉత్పాదక సంస్థలు ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి కదా. అందుకే ఈ ఈ వ్యవహారాన్ని వెంటనే సెటిల్‌ చేయండి ప్లీజ్‌ అని  సీఎం జగన్ మోదీకి విజ్ఞప్తి చేశారట.

విద్యుత్ బకాయిలే కాదు.. ఇంకా అనేక సమస్యలు ఏపీ, తెలంగాణ మధ్య విభజన విషయంలో ఉన్నాయి. ఉద్యోగుల విషయం కూడా ఇంకా కొన్ని పెండింగ్‌ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రం విడిపోయి 8 ఏళ్లు దాటింది. ఇంకా ఎంత కాలం పెండింగ్‌ పెడతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: