రాజధాని రైతులకు మరోసారి సీఆర్డిఏ నోటీసులు ఇచ్చింది. ఈనెల 30లోగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని నోటీసులు అందజేసింది. నోటీసులు జారీ చేయాలని సీఆర్డీఏ అధికారుల్ని కమిషనర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. ఈనెల 10వ తేది లోగా నోటీసుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఇచ్చిన నోటీసులకు రైతుల నుంచి స్పందన కరవైంది. కేవలం 929మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సీఆర్‌డీఏ కమిషనర్‌ వెల్లడించారు. ఇంకా రిజిస్ట్రేషన్ కు 17వేల మందికి పైగా రైతులు ముందుకురావాల్సి ఉంది.

అమరావతి నిర్మాణంపై కోర్టు తీర్పు ప్రకారం సీఆర్‌డీఏ చర్యలు తీసుకోక తప్పలేదు. అయితే.. మీ భూములు అభివృద్ధి చేస్తాం.. ముందు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని సీఆర్‌డీఏ నోటిసులు ఇచ్చినా.. రైతులు స్పందించకపోవడం ఇప్పుడు సీఆర్‌డీఏకే షాక్ ఇస్తోంది. మరి రాజధాని రైతుల మనస్సుల్లో ఏముందో.. ఎందుకు రిజిస్ట్రేషన్లకు వెనుకాడుతున్నారో?


మరింత సమాచారం తెలుసుకోండి: