ఉక్రెయిన్‌ పై రష్యా బాంబులతో విరుచుకుపడుతూనే ఉంది. ఉక్రెయిన్ నగరాలపై శతఘ్నులు పేలుస్తూనే ఉంది. దాదాపు మూడు నెలలకుపైగా రష్యా ఈ భీకర యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అయితే.. కొన్ని నగరాలు క్రమంగా యుద్ధం నుంచి కోలుకుంటున్నాయి. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో మూడు నెలల తర్వాత మళ్లీ థియేటర్లు తెరుచుకుంటున్నాయి. అలా థియేటర్ ప్రారంభించిన  తొలిరోజే ఆటలకు సంబంధించిన అన్ని టికెట్లు అమ్ముడుపోయాయి.

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో జన జీవనం సాధారణ స్థితికి చేరుతోంది. క్రమంగా సినిమా థియేటర్లు, నేషనల్‌ ఒపేరా వంటి ప్రదర్శనశాలలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. కీవ్‌ లోని పొదిల్‌లో నిన్న ఓ థియేటర్‌ కూడా ప్రదర్శన ప్రారంభించారు. యుద్ధం సమయంలో జనం వస్తారా రారా అని థియేటర్‌ యజమానులు కాస్త ఆందోళన చెందారట. కానీ.. మొదటి రోజే అన్ని టికెట్లు అమ్ముడుపోవడంతో వారు ఆనందభరితులయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: