రాష్ట్రపతి.. రాజ్యాంగం ప్రకారం ఈ దేశాధినేత.. త్రివిధ దళాలకు అధిపతి. అలాంటి కీలక పదవి ఎన్నిక మాత్రం మిగిలిన ఎన్నికల్లా ఉండదు.. చాలా క్లిష్టంగా ఉంటుంది. మరి రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారో తెలుసా.. రాష్ట్రపతి ఎన్నికల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఈ రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారిగా రాజ్యసభ లేదా లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌ ఉంటారు.


ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం 4వేల 809 మంది ఓటు వేయబోతున్నారు. అయితే.. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తంగా దాదాపు సమానమైన ఓట్ల విలువనే కలిగి ఉంటారు. ఓటు విలువ లెక్కింపును 1971 నాటి 54.93 కోట్ల జనాభానే ప్రాతిపదికగా తీసుకుంటారు. 776 మంది ఎంపీల ఓట్ల విలువ 5 లక్షల 43 వేల 200. అలాగే 4వేల 33 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ 5 లక్షల 43 వేల 231. ఎమ్మెల్యేల ఓటు విలువ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. ఇది ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 208. అయితే.. అతి తక్కువ ఓటు విలువ సిక్కింలో 7 అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: