లక్షలు పోసి వాహనం కొనసాగే సరికాదు.. దానికో ఫ్యాన్సీ నెంబర్‌ తెచ్చుకోవడం కూడా ఇప్పుడు ఓ ఫ్యాషన్ అయ్యింది. కేవలం ఫ్యాన్సీ నెంబర్‌ కోసమే కొందరు వాహనానికి పెట్టిన ఖర్చు పెడుతుంటారు కూడా. అందుకే ప్రభుత్వాలు దీన్ని కూడా  మరింత ఆదాయం సమకూర్చే ప్రక్రియగా మార్చేశాయి. వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల  రిజిస్ట్రేషన్ ఫీజును ఎప్పటికప్పుడు పెంచుతున్నాయి. ఇప్పుడు ఏపీ కూడా ఈ ఫీజును గణనీయంగా పెంచుతూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది.


ఇక ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజు ఇప్పుడు గరిష్టంగా 2 లక్షలు.. కనిష్టంగా  5 వేల వరకు ఉండబోతోంది. ఇలా చేస్తే ఏడాదికి 100 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. 9999 ఫ్యాన్సీ నెంబరుకు  2 లక్షల మేర రిజిస్ట్రేషన్ ఫీజుగా చేశారు. అలాగే 1, 9, 9999 ఫ్యాన్సీ నెంబర్లకు 1 లక్షల మేర రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఇవి కాకుండా ఇతర ఫ్యాన్సీ నెంబర్లకు  50 వేలు,  30 వేలు,  20 వేలు,  10 వేలు,  5 వేలుగా రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: