కరోనా తర్వాత ఇప్పుడు దేశం అంతా కోలుకుంటోంది. ఇందుకు అనుగుణంగా అంతర్జాతీయంగానూ మన రేటింగ్‌ మెరుగుపడుతోంది. భారత సార్వభౌమ రేటింగ్‌ను ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ తాజాగా ఫిచ్‌ సవరించింది. రెండేళ్ల తర్వాత భారత్‌ రేటింగ్‌ను ప్రతికూలం నుంచి స్థిరత్వానికి ఫిచ్‌ మార్చింది. దేశ ఆర్థికవ్యవస్థ కోలుకోవడం వల్ల మధ్యకాలిక వృద్ధి అంచనాలు కనిపించడం వల్ల భారత రేటింగ్‌ విషయంలో తన ఆలోచన మార్చుకుంది. ప్రపంచ కమొడిటీ ధరల నుంచి సవాళ్లు ఉన్నప్పటికీ ఆర్థికరంగంపై ఉన్న ఒత్తిడిని తగ్గించడం వల్ల వృద్ధి అవకాశాలు కనిపిస్తున్నాయని ఫిచ్‌ చెబుతోంది. కొవిడ్‌ మహమ్మారి తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ బలంగా కోలుకుంటోందని మెచ్చుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ 8.5 శాతం వృద్ధి నమోదు కావచ్చని మార్చి నెలలో ఫిచ్ అంచనా వేసింది. అయితే తాజాగా దీన్ని 7.8 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణమే ఇందుకు కారణమంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: