తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆంధ్రా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ భేటీపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హనీ ట్రాప్ లో ఉండవల్లి పడ్డారని.. సమైక్యాంధ్ర సిద్దాంతం కోసం పోరాడారనే గౌరవం గతంలో ఉండవల్లిపై ఉండేదని ఇప్పుడు అది పోయిందని రేవంత్ రెడ్డి అన్నారు.

ఇంకా రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. “ కేసీఆర్ బీజేపీ పై పోరాడితే.. కేసీఆర్ చేసిన అవినీతి పై బీజేపీ ఎందుకు విచారణ జరిపించడం లేదు.. ఇంత చిన్న లాజిక్ ఉండవల్లి ఎలా మిస్ అయ్యారు.. రాష్ట్ర విభజన పై ఉండవల్లి రెండు పుస్తకాలు రాసారు.. రెండు పుస్తకాలలో తెలంగాణ ఏర్పాటునే తప్పు బట్టారు.. తెలంగాణ కోసం పోరాడిన మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ,పొన్నం ప్రభాకర్ ను విమర్శించారు. అలాంటి వ్యక్తి ని కేసీఆర్ ఇంటికి పిలిచి కలసి పనిచేయమంటరా.. సారా పాతదే..సీసా కొత్తది అన్నట్లు.. టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తరట.. కేసీఆర్ పక్కన ఉన్న వాల్లంతా.. బీహార్ వాల్లే.. టిఆర్ఎస్ కాదు.. అది బీహార్ రాష్ట్ర సమితి.. ఉండవల్లి అడ్డామీద కూలిగా మారి కేసీఆర్ తో కలవద్దు.. తెలంగాణ ను వ్యతిరేకించిన ఉండవల్లి ని కేసీఆర్ దగ్గరకు తీస్తే..తెలంగాణ సమాజం ఊరుకోదు ” అంటున్నారు రేవంత్ రెడ్డి


మరింత సమాచారం తెలుసుకోండి: