ఉక్రెయిన్ ఇప్పుడు సొంత ప్రజలనే తానే చంపుకుంటోంది. అవును.. ఇప్పుడు ఉక్రెయిన్‌లో వందల మంది మందుపాతర్లకు బలవుతున్నారు. అయితే.. ఆ మందు పాతర్లు పెట్టింది మరోవెరో కాదు.. ఉక్రెయిన్ సైన్యమే.. అవును.. రష్యా ను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సైన్యం పెట్టిన మందు పాతర్లు ఇఫ్పుడు సొంత ప్రజలనే బలి తీసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న సాయుధ పోరులో పాపం.. సామాన్యులే ఇప్పుడు సమిధలుగా మారుతున్నారు.



రష్యా దాడిలో ఇప్పటికే వందల మంది ఉక్రెయిన్‌ ప్రజలు మరణించారు. ఇప్పుడు రష్యా బలగాలను నిలువరించేందుకు ఉక్రెయిన్‌ బలగాలు భారీగా పాతిపెట్టిన మందుపాతరలే.... వారికి కొత్త సమస్యగా మారాయి. శత్రువుల రాకను నిరోధించేందుకు పాతిన వేలాది మందు పాతరలు ఇప్పుడు ఉక్రెయిన్‌ ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. చాలా నగరాల్లో రష్యా యుద్ధం ముగించినా.. ఈ మందుపాతర్ల కారణంగా ప్రాణ నష్టం మాత్రం జరుగుతూనే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: