విశాఖ జిల్లా అంటే సీఎం జగన్ కి ప్రత్యేకమైన అభిమానమంటున్నారు విశాఖ జిల్లా ఇంచార్జ్ మంత్రి విడదల రజిని. జిల్లా సమీక్ష సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. జీవీఎంసీ, విమ్ఆర్డిఎ, రోడ్లు, టూరిజం, నగర అభివృద్ధి, పారిశుధ్యం, వీధి లైట్లు, ఆరోగ్యం, నాడు నేడు పనులులై సమీక్ష నిర్వహించారు. ఎక్కడా జరగని అభివృద్ధి పనులు విశాఖ జిల్లాలో జరుగుతున్నాయని.. విశాఖను రానున్న రోజుల్లోమరింత అభివృద్ధి చేస్తామని విశాఖ జిల్లా ఇంచార్జ్ మంత్రి విడదల రజిని అన్నారు.


సీఎం జగన్ చెప్పినవి చెప్పని హామీలు కూడా అమలు చేశారని.. విశాఖ అభివృద్ధికి సీఎం జగన్ ప్రత్యక శ్రద్ధ చూపిస్తున్నారని విశాఖ జిల్లా ఇంచార్జ్ మంత్రి విడదల రజిని అన్నారు. పదే పదే ఋషికొండపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. చంద్రబాబు హయాంలోనూ అభివృద్ధి కోసం కొండలు చదును చేశారని విశాఖ జిల్లా ఇంచార్జ్ మంత్రి విడదల రజిని తెలిపారు. చంద్రబాబు హయాంలో కొండలు చదును చేస్తే అభివృద్ధి.. జగన్మోహన్ రెడ్డి హయాంలో చదును చేస్తే విధ్వంసమా? అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: