ఐపీఎస్‌ అధికారి.. అంటే ఓ హోదా.. ఓ దర్పం ఉంటాయి. ఠీవీగా ఓ కార్యాలయం.. అందులో ఓ ఛాంబర్‌.. ఇలా చాలా ఊహించుకుంటారు. కానీ ప్రస్తుతం ఓ సీనియర్ ఐపీఎస్‌ అధికారికి మాత్రం కూర్చునేందుకు ఓ ఛాంబర్‌ కూడా లేదు. ఆయనే.. ప్రింటింగ్‌ స్టేషనరీ కమిషనర్‌ సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి ఏ.బి.వెంకటేశ్వరరావు. ఆయన నిన్న బాధ్యతలు స్వీకరించారు. పాపం.. ఆయన  మూడేళ్ల తర్వాత తాను బాధ్యతలు తిరిగి బాధ్యతలు స్వీకరించారు.

ఆయనపై కోపంగా ఉన్న జగన్ సర్కాకు ఆయనకు పెద్దగా పని లేని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చింది. విజయవాడ ముత్యాలంపాడులోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ కు గతంలో కీర్తి ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రింటింగ్ విభాగానికి ఆదరణ తగ్గుతూ వచ్చింది. అయితే పాపం.. ఏబీవీ ఆ అసంతృప్తిని పెద్దగా కనిపించనివ్వట్లేదు.. ఇది ప్రాధాన్యత లేని పోస్టింగ్‌గా భావించడం లేదంటూ సర్ది చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ips