సాంగ్లీ జిల్లాలోని మైసల్ కు చెందిన మాణిక్ వన్మోర్ ఓ వెటర్నరీ డాక్టర్. ఆయనతో పాటు ఆయన తమ్ముడు పోపత్ వన్మోర్ కుటుంబాలు ఒకే ఇంట్లో ఉమ్మడిగా జీవిస్తున్నారు. సోమవారం ఉదయం వీరి ఇంటి నుంచి ఎవరూ బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు ఇంటి తలుపులు కొట్టారు. లోపలి నుంచి స్పందన లేకపోయేసరికి తలుపులు బద్దలుకొట్టి చూస్తే.. నేలపై 9 మృతదేహాలు ఉన్నాయి.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరు ఆహారంలో విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అప్పుల కారణంగానే వీరంతా ఆత్మహత్యలు చేసుకుని ఉండొచ్చంటున్నారు.