ఆత్మకూరులో వైసీపీ ఘన విజయం సాధించింది. దాదాపు 88 వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి డిపాజిట్‌ కోల్పోయారు. మొత్తం పోలైన ఓట్లలో ఆరో వంతు ఓట్లు దక్కించుకుంటే డిపాజిట్‌ వెనక్కి ఇస్తారు. కానీ.. ఇక్కడ బీజేపీ అభ్యర్థి 19 వేల పైచిలుకు ఓట్లు దక్కించుకున్నారు. అందువల్ల డిపాజిట్ దక్కలేదు.


అయితే.. డిపాజిట్ దక్కకపోయినా బీజేపీకి దాదాపు 19 వేల పైచిలుకు ఓట్లు రావడం ఆనందాన్ని ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీకి దిగలేదు. అందువల్ల వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి గెలుపు లాంఛనమే అయ్యింది. కానీ.. ఇక్కడ బీజేపీ ఓడిపోతుందని ముందే తెలిసినా చిత్తుగా ఓడిపోతుందని.. ఆ పార్టీకి 10 వేల ఓట్లు రావడం కూడా అనుమానమే అని అంతా అనుకున్నారు. కానీ.. ఇక్కడ బీజేపీ అభ్యర్థి దాదాపు 20 వేల ఓట్లు దక్కించుకోవడం ఆ పార్టీకి ఆనందం ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: