మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తనను ఓడించేందుకు తెలుగుదేశం పార్టీ  గుడివాడలో సభలు పెట్టడం కాదని.. గుడివాడ లో తనపై పోటీ చేసే అభ్యర్థి ఎవరున్నారో చంద్రబాబు నాయుడు  చెప్పాలని సవాల్ చేశారు. తనపై పోటీ చేసే వారు టీడీపీలో లేకపోతే.. నేరుగా చంద్రబాబు నాయుడే  పోటీ చేసి నాపై గెలవాలని మాజీ మంత్రి కొడాలి నాని  సవాల్ చేశారు.


గుడివాడ కన్వెన్షన్ ప్రాంగణంలో జరిగిన నియోజకవర్గ వైసీపి  ప్లీనరీ సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీపై విరుచుకుపడ్డారు. 2024 ఎన్నికల్లో ఆధికారం వస్తుందని చంద్రబాబు పగటి కలలు కంటున్నాడని కొడాలి నాని అన్నారు.  చంద్రబాబు దమ్ము ధైర్యం ఉంటే గుడివాడలో తనపై పోటీ చేసి గెలవాలని ఎమ్మెల్యే కొడాలి నాని ఛాలెంజ్ చేశారు. 2004 నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నానని.. 2024, 29 ఎన్నికల్లో కూడా తానే గెలుస్తాని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: