రైతుబంధు.. ఇది కేసీఆర్ మానసిక పుత్రిక. సాగు చేస్తున్న రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో సొమ్ము వేస్తున్న పథకం ఇది. ఏడాదిలో రెండు సార్లు ఈ సొమ్ము వేస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఈ పథకాన్ని దేశమంతా అమలు చేయాలని టీఆర్ఎస్‌ డిమాండ్ చేస్తోంది. 


రసాయన ఎరువులు, పెట్రోల్, డీజిల్, యాంత్రీకరణ ధరలు పెంచి రైతులపై భారం మోపిందంటున్న టీఆర్‌ఎస్ రైతులకు మోదీ సర్కారు ఏం సాయం చేస్తోందని ప్రశ్నిస్తోంది. 7 ఏళ్లల్లో రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో రూ.3.65 లక్షల కోట్లు  కేంద్రానికి వెళ్ళాయంటున్న టీఆర్ఎస్ నేతలు.. కానీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయంటున్నారు. 


భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో తాము ప్రధాని మోదీని కలిసే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ మంత్రులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా రైతుబంధు అమలు చేస్తామని ఈ బీజేపీ సమావేశాల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: