రష్యా ఉక్రెయిన్ పై దాడులు మరింత ఉధృతం చేసింది. ఒడెసా తీర ప్రాంతమే లక్ష్యంగా  రష్యా సైన్యం భీకర దాడులకు దిగింది. ఒడెసాకు 50 కిలోమీటర్ల దూరంలోని సెర్హివ్కా పట్టణంపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. రష్యా క్షిపణుల దాడిలో 20 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడిన మరో 40 మంది వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు.


రష్యా ప్రయోగించిన కెహెచ్‌-22 క్షిపణులు సెర్హివ్కా పట్టణంలో ఓ అపార్టుమెంటుపై పడ్డాయి. అంతే కాదు.. మరో రెండు శిబిరాలపైకి దూసుకెళ్లాయి. అందువల్ల ప్రాణ నష్టం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాణ నష్టం వివరాలను ఉక్రెయిన్‌ అధ్యక్ష భవనం స్వయంగా వెల్లడించింది. రష్యా దాడులను తీవ్రంగా ఖండించిన ఉక్రెయిన్.. రష్యా ఒక ఉగ్రవాద దేశమంటూ మండిపడింది. యుద్ధ క్షేత్రంలో ఉక్రెయిన్‌ సేనల చేతిలో ఓటమిని జీర్ణించుకోలేక.. సామాన్యులపై రష్యా దాడులకు దిగుతోందని ఉక్రెయిన్ మండిపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: