తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాయలసీమ జిల్లాల్లో మూడు రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో సాగే ఈ పర్యటనలో పాల్గొంటారు. ఈ జిల్లాల్లో  మహానాడు, నియోజకవర్గాల వారీ సమీక్ష నిర్వహిస్తారు. బాదుడు బాదుడే రోడ్ షోలు నిర్వహిస్తారు. ఇప్పటికే మహానాడు జోష్ లో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. అలాగే ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. దీంతో మరింత ఊపు తెచ్చేందుకు చంద్రబాబు రాయల సీమ టూర్‌ కు ప్లాన్ చేశారు.


ఇవాళ్టి నుంచి ఈ నెల 8వ తేదీ వరకూ చంద్రబాబు రాయలసీమలో పర్యటిస్తారు. ఇవాళ మదనపల్లి నియోజకవర్గంలో జిల్లా మహానాడు ద్వారా భారీ బహిరంగ సభ నిర్వహించారు.  రేపు పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష ఉంటుంది. 8న తేదీన చిత్తూరు జిల్లాలోని నగిరి, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: