
అవేంటంటే.. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసంలో గుట్టలుగా నోట్ల కట్టలు దొరికాయట. అలాగే ఆ ఇంట్లో ఓ భారీ బంకర్‌ను కూడా ఆందోళన కారులు కనిపెట్టారు. ఈ బంకర్‌ను చూసిన తర్వాత అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అక్కడి నుంచే పారిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ
బంకర్ బయటి నుంచి చూస్తే సాధారణ గదిలాగానే ఉందట. తలుపులు పగులగొట్టి చూస్తే అప్పుడు బంకర్ కనిపించిందట. అయితే శుక్రవారమే పరారైన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స గురించి మాత్రం ఇంకా సమాచారం తెలియడం లేదు.