ఎవరైనా నేతలు బూతులు తిడితే అన్‌ పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటాం.. ఇప్పుడు జులై 18 నుంచి  పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ప్రారంభం కానున్నాయి కదా. అందుకే.. ఈసారి పార్లమెంట్‌లో ఏ పదాలు వాడకూడదో ముందే లోక్‌సభ ప్రకటించింది. ఈ సారి నిషేధిత పదాల జాబితాను వెల్లడించింది.

ఆ పదాలు ఏంటో తెలుసా.. శకుని., ఖలిస్థానీ, చంచాగిరి, క్రిమినల్‌, అసమర్థుడు, విశ్వాస ఘాతకుడు, నియంత వంటి పదాలు వాడకూడదడట. ఈ ఈ పదాలను సభ్యులు తమ ప్రసంగంలో ఉపయోగించకూడదని లోక్‌సభ సచివాలయం ఏకంగా ఓ బుక్‌లేట్‌ విడుదల చేసింది. అంతే కాదు..  
వేధించడం, అవినీతిపరుడు, డ్రామా, హిపోక్రసీ వంటి పదాలపైనా నిషేధం విధించింది. ఎవరైనా సభ్యుడు పై పదాలు వాడితే.. ఆ ప్రసంగాన్ని రికార్డుల నుంచి తొలగిస్తారన్నమాట. అయితే.. మరి ఈ పదాలు చాలా లైట్ అని.. ఇంత కంటే ఘాటుగా నేతలు మాట్లడాతారని నిపుణులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: