పాశ్చాత్య దేశాల్లో వావివరుసలు ఉండవని అంటారు.. ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తండ్రి విషయం తెలిస్తే ఔరా అని ఆశ్చర్యపోవాల్సిందే. ఎలాన్ మస్క్ తండ్రి ఎరాల్ మస్క్.. 76 ఏళ్ల వయస్సులో మళ్లీ తండ్రి అయ్యాడు. ఇలా చాలా మంది అవుతారు. అయితే.. ఇక్కడ వింత ఏంటంటే.. ఆ ఎరాల్‌ మస్క్‌ బిడ్డకు తల్లి ఎవరో తెలుసా.. అదే ఎరాల్‌ మస్క్ భార్య కూతురు.. అంటే ఆయనకూ కూతురు వరుస అన్నమాట.


అంటే కూతురు వరసయ్యే మహిళతో ఎరాల్ మస్క్‌ 76 ఏళ్ల వయస్సులో మళ్లీ తండ్రయ్యాడన్న మాట. అంతే కాదు..ఇతగాడు ఇంకా ఏమంటున్నాడంటే.. అసలు పుట్టింది పిల్లల్ని కనడానికేగా అంటున్నాడు. ఇతగాడి పెళ్లిళ్ల విషయానికి వస్తే.. ఎరాల్ మస్క్ కు... ఎలాన్ మస్క్ తల్లి మయే హల్దేమాన్ తో 1979లోనే పెళ్లయింది. ఆమె నుంచి విడాకులు తీసుకున్న ఎరాల్ మస్క్ రెండో వివాహం చేసుకున్నారు. అంతే కాదు.. అప్పటికే ఇద్దరు పిల్లలున్న హైడేతో మరో ఇద్దరికి తండ్రయ్యారు. ఇప్పుడు రెండోభార్య కుమార్తె 35ఏళ్ల జానాతో సహజీవనం చేస్తున్నాడు. ఇప్పుడు జానాతోనే రెండో బిడ్డను కన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: