ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికలో  ప్రధాన అభ్యర్థులుగా ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హాలు బరిలో ఉన్నారు. ఎన్‌డీఐ తరపున ముర్ము పోటీలో ఉంటే ప్రతిపక్షాల తరపున యశ్వంత్‌ సిన్హా  బరిలో ఉన్నారు. అయితే.. ఎన్‌డీఏ కూటమి నిలబెట్టిన ముర్ముకే విజయవకాశాలు ఎక్కువ. ఎందుకంటే.. ఎన్‌డీఐ కూటమిలోని పార్టీలతో పాటు అనేక రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు కూడా ముర్ముకే తమ మద్దతు ప్రకటించాయి.


బీజేడీ, వైసీపీ, బీఎస్పీ, టీడీపీ, ఏఐడీఎంకే, జేడీఎస్‌, శిరోమణి అకాలిదళ్‌, శివసేన, జేఎంఎం వంటి ప్రాంతీయ పార్టీలు కూడా తమ ఓటు ముర్ముకేనని ఇప్పటికే చెప్పేశాయి. అంటే మూడోవంతు ఓట్లు ముర్ముకే దక్కుతాయన్నమాట. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలకు చెందిన మొత్తం 10లక్షల 86వేల 431 ఓట్లు పోల్ అవుతాయి. అందులో 6.67లక్షల ఓట్లు ముర్ముకే వచ్చే అవకాశం ఉంది. ఈ రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు 21న వెలువడతాయి. కొత్త రాష్ట్రపతి నెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: